తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే లక్ష్యంతో కాకినాడ తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాసమస్యలపై 'మీ ఇంటికే మీ నవీన్' కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ కిర్లంపూడి మండలం శృంగారయుణిపాలెం, ఎస్. తిమ్మాపురం, గెద్దానపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తామని ఆయన భరోసానిచ్చారు.
ఇదీచదవండి