ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న తన అభిమాని కోరిక తీర్చాడు సినీనటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కొప్పాడి మురళి ఇటీవల యాక్సిడెంట్‌కి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి రెండు కిడ్నీలు దెబ్బతినడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాను ఎంతో అభిమానించే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని.. తన చివరి కోరికగా కలవాలని మాట్లాడలేని స్థితిలో ఉన్న మురళి వైద్యులకు చీటీ రాసి చూపించాడు. వైద్యులు దానిని బాధితుడి తల్లిదండ్రులు, బంధువులకు తెలియజేశారు. వారు తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షులు రాయుడు బాబ్జి, భాస్కర్ చౌదరిలకు విషయాన్ని తెలియచేశారు. అలా విషయం ఎన్టీఆర్‌కు తెలియజేశారు. తనను ఎంతగానో ప్రేమిస్తున్న తన అభిమానికి ఇలా జరగడం ఆయనను కలచివేసింది. వెంటనే ఎన్టీఆర్ మురళితో వీడియో కాల్ చేసి పరామర్శించారు. తాను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌ను చూసిన మురళి ఆనందోత్సాహంతో ఉప్పొంగిపోయాడు. ఆయనను చూసిన మురళి సంపూర్ణ ఆరోగ్యంతో మూడు నెలల్లో బయటకు వస్తానని తన సైగలతో వివరించాడు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి తిరిగి రావాలని ఎన్టీఆర్ మురళికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మురళి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎన్టీఆర్‌కి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి:
PATTABHI: ఎమ్మెల్యే ద్వారంపూడి తాటాకు చప్పుళ్లకు బెదరం: పట్టాభి