ETV Bharat / state

'రహదారి సమస్యకు 48 గంటల్లో పరిష్కారం చూపాలి' - రహదారుల కోసం జనసేన ఆందోళలు

రహదారి నిర్మాణ పనుల్లో అధికారుల, గుత్తేదార్ల అలసత్వం కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జనసేన ఇంఛార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్ర విమర్శించారు. 4 నెలల క్రితం తిమ్మాపురం-మల్లిసాల సింగరమ్మ చింత వరకు నిర్మించిన రహదారి అధ్వాన్నంగా మారటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిరసనలు తెలిపారు.

రహదారి సమస్యకు 48 గంటల్లో పరిష్కారం చూపాలి

author img

By

Published : Sep 26, 2020, 6:20 PM IST

తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం-మల్లిసాల సింగరమ్మ చింత వరకు నిర్మించిన రహదారి అధ్వాన్నంగా తయారైందని జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. 25 కోట్ల వ్యయంతో 21 కిలోమీటర్లు నిర్మించిన రహదారి 4 నెలల్లోనే పాడవటం అధికారుల, గుత్తేదారుల నిర్లక్ష్యానికి కారణమని జగ్గంపేట జనసేన ఇంఛార్జ్ పాఠం శెట్టి సూర్యచంద్ర విమర్శించారు. గత రాత్రి ఈ రహదారిపై ప్రమాదానికి గురై నలుగురు తీవ్రంగా గాయపడ్డారని మండిపడ్డారు. ప్రజాధనంతో నిర్శించే రోడ్లను ప్రజలకు ఉపయోగపడేలా ఉండేలా కానీ..హాని చేసేదిగా ఉండకూడదని వ్యాఖ్యనించారు. ఈ సమస్యపై 48 గంటల్లోగా స్పందించి పరిష్కారం చూపకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి

రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు: ఐఎండీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.