తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంతబాబు తదితరులు హాజరయ్యారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ చెప్పారు. ఏజెన్సీలో ఆదివాసీలను అభివృద్ధి చేసేందుకు 90శాతం రాయితీపై రుణాలు, విత్తనాలు అందించామని ఎమ్మెల్యే అన్నారు.
విశాఖపట్నం జిల్లాలో..
విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శెట్టి ఫాల్గుణ హాజరయ్యారు. సెల్ సిగ్నల్స్ లేక గిరిజనులు ప్రభుత్వ పథకాలకు గిరిజనులు దూరమవుతున్నారని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. గిరిజనులకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నామని కలెక్టర్ వినయ్‌చంద్ పేర్కొన్నారు.
నర్సీపట్నంలో మైదాన ప్రాంత గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: