రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న 44వ అంతర్రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రముఖ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సందర్శించారు. పోటీలను తిలకించారు. రాజమహేంద్రవరంలో ఇంత మంచి టోర్నమెంటు జరగడం చాలా సంతోషకరమైన విషయమని గోపీచంద్ అన్నారు. అందరికీ క్రీడలు అవసరమని... ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. పాఠశాల, కళాశాల స్థాయిలోనే విద్యార్ధులకు ఆడుకునేందుకు మంచి సౌకర్యాలు కల్పిస్తే... విద్యార్థులకు ఆటలను కెరీర్‌గా కూడా తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరంలో మల్టిపుల్ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు.
ఇవీ చదవండి: