యానాంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సందర్శకులను... బొటానికల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది. వాటర్ స్క్రీన్‌పై హిందీ చిత్రాలలోని పాటలను ప్రదర్శిస్తూ.. సంగీతానికి అనుగుణనంగా వివిధ రంగుల విద్యుత్ దీపకాంతుల ఆధారంగా నీటితో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. పండుగ వారం రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి ఈ ప్రదర్శన ఉంటుందని పర్యటకశాఖ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: పండగ రోజున అశ్లీల నృత్యాలు.. వైకాపా నాయకుల చిందులు