తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ఏలంక గ్రామ కొత్త చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను ఆ గ్రామ యువకులు అడ్డుకున్నారు. రాత్రివేళల్లో అనుమతులు లేకుండా ప్రైవేట్ లేఔట్లకు మట్టిని తరలిస్తుండగా అడ్డగించారు. పోలీసులకు సమాచారం ఇచ్చి... నాలుగు లారీలతో పాటు ఒక జేసీబీని అప్పగించారు. అనుమతులు లేకుండా మట్టిని తవ్వుతున్న వారిపై... చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: సెల్ ఫోన్ కొనలేదని యువతి ఆత్మహత్య!