తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్థులు పట్టుకున్నారు. రేషన్ దుకాణం నుంచి ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తుండగా పలువురు చూసి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్, ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని ద్విచక్ర వాహనం, నాలుగు బస్తాల బియ్యాన్ని సీజ్ చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి.