తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో అక్రమంగా నిల్వచేసిన బొండు ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కొత్తపేట మండలం బోడిపాలెం వంతెన సమీపంలో ఇటుక బట్టీ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వచేసిన బొండు ఇసుకను తహసీల్దార్ కిషోర్ బాబు, రావులపాలెం సీఐ వి.కృష్ణ సీజ్ చేశారు. 55 యూనిట్లు, 11 లారీలు ఉంటుందని సీఐ తెలిపారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి