ETV Bharat / state

మద్యం మత్తులో... భార్యను డంబెల్స్​తో కొట్టిన భర్త - east-godavari-district news updates

మద్యం మత్తులో ఉన్న భర్త... భార్య తలపై డంబెల్స్​తో కొట్టి గాయపరిచిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సంచలనం సృష్టించింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు... ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు... హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

husband-attack-on-his-wije-with-dumbbells-in-kovooru-east-godavari-district
మద్యం మత్తులో భార్యను డంబెల్స్​తో కొట్టిన భర్త
author img

By

Published : Sep 10, 2020, 8:05 PM IST

మద్యం మత్తులో భార్యను డంబెల్స్​తో కొట్టిన భర్త

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో నివాసముంటున్న శ్రీను, మాధవి... ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. శ్రీను ఆర్​టీసీ డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి మద్యపానం అలవాటు ఉంది. మద్యం తాగి వచ్చి రోజూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. ఈ ఘటనపై మాధవి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఇతర కారణాలతో కేసును ఉపసంహరించుకుంది. అయిప్పటికీ శ్రీనులో మార్పు రాలేదు.

ఈ క్రమంలో ఈనెల నాలుగో తేదీన శ్రీను... మద్యం మత్తులో మాధవి తలపై డంబెల్​తో కొట్టాడు. గమనించిన స్థానికులు తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా... అంతగా స్పందించలేదని బాధితురాలి కుమార్తె ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి తీరును తప్పుబడుతూ.. అతని ప్రవర్తనను వివరించింది.

ఇదీ చదవండి:

చలో అంతర్వేదికి మా మద్దతు ఉంటుంది: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.