40 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - east godavari district crime news
తూర్పు గోదావరి జిల్లా చెరువూరులో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని గ్రామస్థులు పట్టుకున్నారు. ఈ ఘటనపై అధికారులతో విచారణ చేయిస్తున్నట్లు స్థానిక తహసీల్దార్ తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న గ్రామస్థులు
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని చెరువూరు గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్థులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇవ్వాల్సిన 40 బస్తాల బియ్యాన్ని మినీ వ్యాన్ లో కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు అడ్డుకున్నారు.
సంబంధిత వ్యాపారిని ప్రశ్నించగా... బియ్యాన్ని పక్క డిపోకు తీసుకెళ్తున్నట్లు సమాధానం ఇచ్చాడని చెరువూరు వాసులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక తాహసీల్దార్ లక్ష్మీ కల్యాణికి ఫిర్యాదు చేశారు. విచారణలో అక్రమాలు జరిగినట్టు నిరూపణ అయితే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చెప్పారు.
ఇదీ చదవండి: