ETV Bharat / state

HC ON MINING: మీరేమో నిద్రపోతుంటారు.. వాళ్లేమో తవ్వేస్తుంటారు: హైకోర్టు

High Court on mining in Kapileswarapuram
కపిలేశ్వరపురంలో మైనింగ్‌పై హైకోర్టులో విచారణ
author img

By

Published : Sep 14, 2021, 10:34 PM IST

Updated : Sep 15, 2021, 7:45 AM IST

22:32 September 14

అక్రమ గనుల తవ్వకాలపై హైకోర్టు ఆగ్రహం

తాత్కాలిక అనుమతులు పొంది ఆ తర్వాత విచ్చలవిడిగా గనుల అక్రమ తవ్వకాలకు(illegal mining) పాల్పడుతున్న వారిపై అధికారులు పర్యవేక్షణ చేయకుండా నిద్ర పోతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఐదు రెట్లు జరిమానా, క్రిమినల్ కేసులు నమోదు చేసే వెసులుబాటు ఉన్నా.. నామమాత్రపు జరిమానాలు వేసి వదిలేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించింది. వాళ్లపై చర్యలు దోమకాటులా కాకుండా పాముకాటులా ఉండాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల పరిధిలోని లంక భూముల్లో బొండు మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలను తక్షణం నిలిపేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, గనుల శాఖ సహాయ సంచాలకులు, తహశీల్దార్​లను న్యాయస్థానం ఆదేశించింది. లంక గ్రామాల్లో భవిష్యత్తులోనూ అక్రమ తవ్వకాలకు వీల్లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై చట్టం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సదరు అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

  కపిలేశ్వరపురం మండల పరిధిలోని కేదారిలంక, బొల్లంక తదితర గ్రామాల్లోని లంక భూముల్లో బొండు మట్టి, ఇసుకను విచక్షణారహితంగా తవ్వి, తరలిస్తున్నారని.. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొంటూ వి.ధనరాజ్ మరో ఇద్దరు హైకోర్టులో వ్యాజ్యం చేశారు. ఇళ్ల స్థలాలకు మెరక కోసమని అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని.. బొండు మట్టి, ఇసుక తవ్వకం వల్ల రైతుల భూములు నదీగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని పిటీషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ వ్యవహారంపై గనుల శాఖ ఏజీపీ బదులిస్తూ.. తవ్వకాలకు తాత్కాలిక అనుమతులు ఇచ్చామన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. తాత్కాలిక అనుమతులు ఇచ్చి మీరేమో నిద్ర పోతుంటారు.. వాళ్లేమో విచక్షణారహితంగా తవ్వేస్తుంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అక్రమార్కులపై జాలి చూపాల్సిన అవసరం లేదని, పూర్తి స్థాయిలో జరిమానా విధించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి..

Telugu academy assets: 'రెండు వారాల్లో ఏపీ ప్రభుత్వానికి నిధులు'

Last Updated : Sep 15, 2021, 7:45 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.