ETV Bharat / state

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ ఎల్లుండికి వాయిదా

Driver Subramanyam murder case: ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు నేడు విచారించింది. ఈ కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఎటువంటి కాల్ డేటా ,సీసీ కెమెరా రిపోర్టు రాకుండానే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయటం పట్ల కేసు నీరు గారి పోతుందని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

author img

By

Published : Dec 5, 2022, 10:15 PM IST

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు
driver Subramanyam murder case

Subramanyam murder case hearing in High Court: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించాలని అతని తల్లిదండ్రులు వేసిన వ్యాజ్యంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున వాదనలను న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. నిందితుడి నేరచరిత్రను దాచిపెట్టి ఎటువంటి కేసులు లేవంటూ అనంతబాబుకు పోలీసులు సహకరించే ప్రయత్నం జరిగిందని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఎటువంటి కాల్ డేటా, సీసీ కెమెరా రిపోర్టు రాకుండానే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయటంతో కేసు నీరు గారిపోతుందని తెలిపారు. ఈ కేసు తక్షణమే సీబీఐకి బదలాయించాలని కోర్టును న్యాయవాది కోరారు. కింది కోర్టులో వేసిన చార్జిషీటు హైకోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం విచారణ కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.