నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ అందజేసిన నిత్యావసర సరుకులను స్థానిక నేతలు పేదలకు పంపిణీ చేశారు. రామ్మూర్తి నగర్ ప్రాంతంలో దాదాపు 700 కుటుంబాలకు సరుకులు, కూరగాయలను అందజేశారు.
తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో పోర్టుని ఆనుకుని ఉన్న పర్లేపేటలో 200 మంది నిరాశ్రయులకు దాతలు ఆహారం అందించారు. విశ్రాంత ఎస్ఐ వీరభద్ర రావు చేయూతతో మన్విత ట్యూషన్ సెంటర్ ఉపాధ్యాయులు, స్థానికులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గోదావరి గుంట, డంపింగ్ యార్డ్ పరిసరాల్లో ప్రభుత్వం ఇచ్చిన సహాయ సహకారాలు అందక పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. చాలా మందికి రేషన్ కార్డులు లేక ఏ సాయం పొందడం లేదు. కాకినాడ యువ బృందం ప్రతిరోజూ ఓ ఆటోలో ఆహారం తీసుకొస్తూ ఇలాంటి పేదలకు అందిస్తోంది. ఆకలి తీరుస్తోంది.
పంచాయితీ, స్వచ్ఛ భారత్ కార్మికులకు అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన నిస్వార్థ స్వచ్ఛంద సేవా సంస్థ అల్పాహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 వేల రూపాయలు విరాళం అందజేసింది.
ఇదీ చూడండి: