తూర్పుగోదావరి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోహిణి కార్తె ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజమహేంద్రవరంలో ఉదయం 10 గంటల నుంచే ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎండల తీవ్రతతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. పట్టణంలో ఎప్పుడూ రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు, దేవిచౌక్, కంబాల చెరువు, పుష్కర్ ఘాట్... తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో పలు సేవా సంస్థలు మంచి నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు.
ఇదీ చదవండి...