తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కురిసిన కుండపోత వర్షానికి కొండ వాగులు పొంగి ప్రవహించాయి. మండలంలోని వాడపల్లి వెళ్లే రహదారిలో పలు వాగులు ఉద్ధృతంగా మారాయి. గంగవరం మండలంలో జువ్వమ్మ కాలువ, బురద కాలువ నిండుగా ప్రవహించటంతో రాకపోకలు స్తంభించాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానల వల్ల దేవీపట్నంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మరో 2 రోజులు ఇలాగే వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశముంది.
ఇవీ చదవండి...