తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురిసింది. డీలక్స్ సెంటర్, ఐఎల్టీడీ జంక్షన్, వీఎల్‌పురం, రైల్వేస్టేషన్‌రోడ్డు, కంబాలచెరువు తదితర లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లింది. కొద్ది రోజులుగా కురుస్తున్ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వరినాట్లు.. రోజుల తరబడి నీళ్లల్లో నానిపోవటంతో దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ బాధితులకు అవమానం.... మహిళను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న యజమాని