మొన్నటివరకు కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడ్డ రైతులు, కూలీలకు.... భారీ వర్షాలు మరో శాపంగా మారాయి. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 10 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంటచేలన్నీ గోదావరిని తలపిస్తున్నాయి. రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్లలో వరి నాట్లుపూర్తిగా మునిగిపోయాయి. రోజుల తరబడి నానిన కారణంగా.. నాట్లు కుళ్లిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటినుంచి వర్షాలు కురవకపోయినా.... ఆ నీళ్లన్నీ పోవడానికి చాలా సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.
ప్రతి సంవత్సరం రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్‌లలో వరినాట్లు వేయడానికి... గుంటూరు జిల్లా నుంచి కూలీలు వస్తారు. ఈ సారి కురిసిన భారీ వర్షాలకు... చేలన్నీ మునిగిపోయిన కారణంగా.. పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల్లేక తిరిగి స్వగ్రామాలకు పయనమవుతున్నామన్నారు. రానుపోను ఛార్జీలకు సైతం డబ్బులు రాలేదన్నారు. ఈ సారి పంట వేయడం కష్టమని రైతులు వాపోయారు. మరే పని లేకపోవడంతో.. ఆదాయం కోల్పోయమంటున్నారు. ఈ ప్రభావం తర్వాతి పంటపైనా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: