తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు కేంద్ర పాలిత యానాంలో బుధవారం సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఆకాశంలో మబ్బులు కమ్మి... ఉరుములతో చిరుజల్లులుగా మొదలై.. ఒక్కసారిగా గాలితోకూడిన వర్షం కురిసింది. జనజీవనం స్తంభించింది. గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వృక్షాలు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపకశాఖ సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి