ETV Bharat / state

ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు.... నిండుకుండల్లా జలాశయాలు

తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరంలో వర్షాలకు వాగులు, వంకలు పొర్లిపారుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల నీరు రోడ్డపైకి ప్రవహించటంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.

మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు.... నిండుకుండల్లా జలాశయాలు

author img

By

Published : Aug 13, 2020, 9:26 AM IST

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భూపతిపాలెం, ముసురుమిల్లి, మద్దిగెడ్డ, సూరంపాలెం జలాశయాలు నిండు కుండల్లా మారాయి. 204 మీటర్ల నీటి సామర్ధ్యం ఉన్న భూపతిపాలెం జలాశయంలోకి గురువారం తెల్లవారుజామున 203.5మీటర్ల నీరు చేరింది. దీంతో ఒక్క గేటు ఎత్తారు. 155 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేశారు. ఆలాగే కొండవాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

  • గోదావరిలో పెరిగిన వరద ఉద్ధృతి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది. పెయ్యేరు ఆనకట్టపైకి వరద నీరు చేరింది. జిల్లాలోని కూడిపల్లి వద్ద కేతేపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తండంగి వద్ద ఈరవాగు రోడ్డుపైకి చేరింది. 4 అడుగుల మేక వరద నీరు ప్రవహిస్తోంగి.

  • పశ్చిమగోదావరి జిల్లాలో...

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం కొత్తూరు కడెమ్మ వంతెన పైకి వరద నీరు చేరింది. పోలవరం మండలంలో 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌లోకి వరద నీరు చేరింది.

ఇవీ చదవండి

ఈ నగరాలకు ఏమైంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.