తూర్పు గోదావరి జిల్లా మన్యంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చింతూరు మండల పరిధిలోని నదులు, వాగులు పొంగి ప్రహిస్తున్నాయి. చింతూరు వద్ద శబరి నది నీటి మట్టం 38 అడుగులకు చేరుకుంది. భద్రాచలంలో గోదావరి నది నీటి మట్టం పెరుగుతున్న కారణంగా.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
శబరి నది ఎగపోటుకు గురికావటంతో పాటు స్థానికంగా ఉన్న వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రధాన రహదారులపై వరద నీరు చేరుకోవటంతో రాకపోకలు చాలా ప్రాంతాల్లో నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: