పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్రవాయుగుండం ప్రభావంతో తమ్మిలేరు, ఎర్రకాలువ జలాశయాలకు వరద పోటెత్తుతోంది. జలాశయాల నుంచి వదులుతున్న వరదనీరు పట్టణాలను ముంచెత్తుతోంది. తమ్మిలేరుకు వరద కారణంగా ఏలూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకొంది.
జిల్లాలోని ప్రత్తిపాడు లంపకలొవ రహదారిపై సుద్దగెడ్డ వాగు పొంగి ప్రవహిస్తుంది.. దీంతో అధికారులు ఆ మార్గాన్ని మూసివేశారు..సుద్దగెడ్డ వాగును కలెక్టర్ మురళీధర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పరిశీలించారు...
భారీ వర్షాల కారణంగా రామవరం వద్ద ఉన్న తిరుమలేశ సిరామిక్స్ కంపెనీలోకి వరద నీరు చేరింది. అందులో పనిచేస్తున్న11 మంది కార్మికులు నీటిలో చిక్కుకున్నారు. వారిని జగ్గంపేట పోలీస్స్టేషన్ లో పనిచేస్తున్నడ్రైవర్ అర్జున్ రక్షించాడు.
ఇదీ చదవండి