అమలాపురం డివిజన్లో భారీగా నమోదైన వర్షపాతం - east godavari latest update
అల్పపీడన ప్రభావంతో అమలాపురం డివిజన్లో భారీగా వర్షపాతం నమోదైంది. 16 మండలాల్లో 1129.40 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
అమలాపురం డివిజన్లో భారీగా నమోదైన వర్షపాతం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో 1129.40 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఐపోలవరంలో అత్యధికంగా 109.8 మిల్లీమీటర్లు వర్షం కురిసిందని డివిజన్ ఉప గణాంక అధికారి ప్రభుదాస్ వెల్లడించారు. అత్రేయపురం 71.2, రావులపాలెం 80.0, కొత్తపేట 61.8 , ముమ్మిడివరం 85.6, అయినవిల్లి 65.4, గన్నవరం 40.0 అంబాజీపేట 36.20, మామిడికుదురు 72.20, రాజోలు 33.80, మలికిపురం, 53.00 సఖినేటిపల్లి, 54.60 అల్లవరం, 106.00 అమలాపురం 98.40, ఉప్పలగుప్తం 82.40, కాట్రేనికోనలో 78.20, మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇదీచదవండి