ఎగువ నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంటుంది. వరద నీటిని అధికారులు సముద్రంలోనికి విడిచిపెడుతున్నారు. ఈరోజు ఉదయం 4లక్షల 70వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలో విడిచిపెట్టారు. దీనితో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని వశిష్ట, వైనతేయ, గౌతమి, గోదావరి నదిపాయలు వరద నీటితో పోటెత్తి ప్రవహిస్తున్నాయి. గ్రామాల ప్రజలు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు.
ఇదీ చూడండి గోదావరి పరవళ్లు... పెరుగుతున్న నీటిమట్టం