గోదావరి నదిపై హేవ్ లాక్ వంతెన 120 ఏళ్లు పూర్తి చేసుకుంది. కొవ్వూరు,రాజమహేంద్రవరాన్ని కలుపుతూ గోదావరిపైనిర్మించిన ఈ వంతెనకు 1897 నవంబరు 11న శంకుస్థాపన చేశారు. 54 స్తంభాలతో 9 వేల 96 అడుగుల పొడవైన వంతెనను.. అప్పటి మద్రాస్ గవర్నర్ హేవ్ లాక్ ప్రారంభించారు. కొందరు విద్యావంతులు, మేధావులు దీన్ని పర్యటకంగా అభివృద్ది చేయాలని కోరటంతో ఇది పర్యాటకశాఖ అధీనంలోకి వెళ్లింది. వంతెనను పర్యాటకంగా అభివృద్ధి పరచడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చూడండి
ఆళ్ల రామకృష్ణారెడ్డికి పితృవియోగం.. సంతాపం తెలిపిన నారా లోకేశ్