కళాశాలకు వేసవి సెలవులు ఇచ్చినందున ఉదయం11 గంటల సమయంలో బొబ్బిల్లంకలోని గోదావరి ఒడ్డున ఉన్న పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు చేరే ప్రయత్నం చేశారు. వీరిలో బంటుపల్లి హరికృష్ణ తెడ్డు వేసి నడపుతండగా అదుపు తప్పి నదిలో పడిపోయాడు. ఈత రాదని సైగల ద్వారానే పడవలో ఉన్న స్నేహితులకు సంకేతాలిచ్చాడు. ముగ్గురిలో జాలిమూడికి చెందిన సిద్దే కిరణ్ కుమార్... నదిలోకి దూకి స్నేహితుడిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉన్నందున కిరణ్ కూమర్ ప్రమాదంలో చిక్కుకున్నాడు.
పరిసర ప్రాంతాల్లో కాకుల శ్రీను అనే వ్యక్తి ప్రమాదాన్ని పపిగట్టి కిరణ్ కుమార్ను రక్షించి పడవలో వేసి ముగ్గురిని ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే హరికృష్ణ గల్లంతయ్యాడు. నలుగురికి మాటలు రానందున రక్షించండనే ఆర్తనాదాలూ చేయలేని పరిస్థితి. కోరుకొండ సీఐ జీవి వినయ్ మోహన్, సీతానగరం ఎస్ఐ యూవీ శివనాగబాబు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను రప్పించి, వలలు వేసి.. గల్లంతయిన హరికృష్ణ కోసం శుక్రవారం రాత్రి 7 గంటల వరకు గాలించినా ప్రయోజనం లేకపోయింది. శనివారం ఉదయం బొబ్బిలంక వద్ద గోదావరిలో మరోసారి గాలింపు చేపట్టగా బంటుపల్లి హరికృష్ణ మృతదేహం లభ్యమైంది.