ETV Bharat / state

Hanuman Jayanti: జై హనుమాన్​ నామస్మరణతో... మార్మోగిన ఆలయాలు - ఉభయ గోదావరి జిల్లాల్లో హనుమాన్​ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు

Hanuman Jayanti: హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, మొక్కులతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆంజనేయస్వామి ఆలయాలు హనుమాన్​ నామస్మరణతో మార్మోగాయి.

Hanuman Jayanti
హనుమాన్ జయంతి
author img

By

Published : May 25, 2022, 3:08 PM IST

Updated : May 25, 2022, 4:58 PM IST

Hanuman Jayanti: హనుమాన్ జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి రోజున స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు శక్తి, సామర్థ్యాలు పెంపొందుతాయని భక్తులు విశ్వసిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్వామివారిని దర్శించుకొనే భక్తులకు అఖండ అన్నసమారాధన ఏర్పాటు చేశారు.

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఆంజనేయ స్వామి ఆలయాలతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తణుకులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి తులసి మాలలు సమర్పించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున 3:30 నిమిషాలకు వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య క్షీరాభిషేకం పంచామృతాలతో కన్నులపండువగా సాగింది. ఆలయ అవరణమంతా జై హనుమాన్ నామస్మరణతో మార్మోగడటంతో అధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

హనుమాన్ జయంతి ఉత్సవాలను కడపలో కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కడప పాత బస్టాండ్​లోని గాలిదేవర ఆంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం అన్నదాన నిర్వహించారు.

శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా నంద్యాల శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తుల స్వామివారిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. స్వామివారిని ప్రత్యేక అలంకరణలో స్వామివారు దర్శనమిచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2022, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.