లాక్‌డౌన్... తూర్పు గోదావరి జిల్లాలోని నేతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తోంది. షాపింగ్ మాల్స్, దుకాణాల్లో వ్యాపారంపై ఆధారపడి వీరంతా అదే రంగంపై ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం అవన్నీ మూతపడిన కారణంగా పొట్టకూటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా తమకు నెలరోజులుగా ఉపాధి లేదని వారు వాపోతున్నారు. పనుల్లేక తీవ్ర కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న నేతన్నలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: