ETV Bharat / state

శాసనసభ, మండలిలో కొత్త విప్​లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ప్రభుత్వ విప్​గా జగ్గిరెడ్డి

శాసనసభ, శాసన మండలిలో ఒక్కొక్కరు చొప్పున నూతన విప్​లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో వెన్నపూస గోపాల్ రెడ్డి, శాసన సభలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలను ప్రభుత్వ విప్​లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ విప్ గా జగ్గిరెడ్డి
ప్రభుత్వ విప్ గా జగ్గిరెడ్డి
author img

By

Published : Aug 19, 2021, 7:51 AM IST

శాసనసభ, శాసన మండలిలో ఒక్కొక్కరు చొప్పున నూతన విప్​లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో వెన్నపూస గోపాల్ రెడ్డి, శాసన సభలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలను ప్రభుత్వ విప్​లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో శాసనసభకు మరో విప్ ను నియమించనున్నారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెంది ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల పేర్లను ఈ పదవికి పరిశీలిస్తున్నారు.

రెండున్నరేళ్ల తర్వాత మంత్రి మండలిని పునర్​వ్యవస్థీకరిస్తామని ముఖ్యమంత్రి జగన్ మెుదట్లోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సమయం దగ్గరపడుతుండటంతో ప్రస్తుత విప్​లలో కొందరికి మంత్రి వర్గంలో అవకాశం దక్కుతుందన్న ప్రచారం ముందు నుంచీ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త విప్​ల నియామకం జరిగిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సమర్థంగా బాధ్యతలను నిర్వరిస్తా: జగ్గిరెడ్డి

వైకాపా ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో మరో సీనియర్ నేతకు విప్ హోదా కల్పించింది. ఇప్పటికే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రభుత్వ విప్ హోదాలో కొనసాగుతుండగా... మరో సీనియర్ నాయకుడు, కొత్త పేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డికి తాజాగా విప్ హోదాను ప్రభుత్వం కల్పించింది. మూడు సార్లు శాసనసభ్యునిగా గెలిచి పార్టీకి విధేయుడిగా ఉన్న జగ్గారెడ్డికి అదిష్ఠానం నుంచి సముచిత గుర్తింపు ఇచ్చిందనే వాదన శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వెలువడిత తర్వాత రావులపాలెంలోని వైకాపా కార్యాలయంలో వైకాపా శ్రేణుల్లో ఆనందోత్సహాలు నెలకొన్నాయి. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ ప్రస్థానం

కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి 1976 నవంబర్ 26 న జన్మించారు.ఈయన స్వాగ్రామం గోపాలపురం. భార్య లావణ్య. పిల్లలు సోమసుందర్ రెడ్డి, శ్రీనిధి. 2001లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ఆరంగ్రేటం చేసిన జగ్గిరెడ్డి...వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో కాంగ్రెస్ తరపున ఒకసారి, జగన్మోహన్ రెడ్డి హయంలో వైకాపా తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమర్థ నాయకుడిగా పనిచేసి పార్టీలో గుర్తింపు పొందారు.

ఇదీ చదవండి:

CM Jagan: 'సెప్టెంబరు 22న కోర్టుకు రండి' : ఈడీ కేసుల్లో జగన్‌కు సీబీఐ కోర్టు సమన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.