తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా భయం నెలకొంది. పోలీసు, రెవెన్యూ, సచివాలయ సిబ్బందికి కరోనా లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. ఏలేశ్వరంలో ఓ కానిస్టేబుల్‌కు.. శంఖవరం మండలం కత్తిపూడి సచివాలయం సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంపై సహోద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళ్లిన ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా కార్యాలయాలు, పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి..