పోలవరంపై కనీసం సీఎం జగన్ కనీసం ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రభుత్వ దమనకాండకు నిదర్శనంగా నిలుస్తోందని ఆరోపించారు. దళిత, మైనారిటీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా...వారిపైనే దాడులకు పాల్పడటం దారుణమని గోరంట్ల విమర్శించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బుచ్చయ్య డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రద్దయ్యే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. దళిత, మైనారిటీలు గుడ్డిగా ఓట్లు వేసినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నామని తెదేపా మైనారిటీ సెల్ మాజీ కార్యదర్శి సుబాన్ అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక పోరు... భాజపా జయకేతనం