తూర్పు గోదావరి జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో వరద తగ్గడం లేదు. దేవీపట్నం మండలంలోని పూడిపల్లి, వీరవరపు లంక, తొయ్యేరు, దేవీపట్నం, కొండమొదలు గ్రామాలు నీటమునిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి, ఆలయాల్లోకీ వరద చేరుతోంది. తీర ప్రాంతాల పరిధిలోని గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. రంపచోడవరం ఆర్డీఓ శ్రీనివాసరావు.. సిబ్బందితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు... తెలంగాణలోని భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పడుతున్న కారణంగా.. తూర్పుగోదావరి జిల్లాపై వరద ప్రభావం తగ్గే అవకాశం ఉంది.
ధవళేశ్వరం దిగువన కోనసీమలోని ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో వరద ఉధృతి కారణంగా.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముమ్మిడివరం లంకల్లోని పొలాలు ముంపు బారిన పడ్డాయి.
ఇవీ చదవండి