గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పడుతున్నా.. ధవళేశ్వరం వద్ద మాత్రం ఎక్కువగానే ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు బ్యారేజీ వద్ద 18.20 అడుగుల నీటిమట్టం ఉంది. 19,78,634 క్యూసెక్కుల నీటిని సముద్రంలోని వదిలారు. ఈరోజు సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉందని వరదల ప్రత్యేక అధికారి కృష్ణారావు తెలిపారు.
ఇవీ చదవండి...