తూర్పుగోదావరి జిల్లాలో గౌతమి, వశిష్ట, వైనతీయ నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమ వరద నీటితో ముంపునకు గురవుతోంది. పలు మండలాల్లో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, అయినవిల్లి, పి.గన్నవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లోని పొలాల్లోకి వరద నీరు చేరింది. అరటి, మునగ, కూరగాయలు, పచ్చిమిర్చి, కంద తోటలు వరద నీటిలో మునిగిపోయి కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పి.గన్నవరం వద్ద పాత, కొత్త ఆక్వాడెక్టుల మధ్య వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. వరదలకు గోదావరి పక్కనే ఉన్న భూములు కోతకు గురవుతున్నాయి. కపిలేశ్వరపురం, కేదర్లంక, కొత్తపేట, నారాయణలంక, బడుగువాణి లంక, ఆత్రేయపురం, అయినవిల్లిలో భూములు కోతకు గురవుతున్నాయి.
ఇదీ చదవండి.