ETV Bharat / state

డెల్టాకు సాగునీటి గండం

గోదావరి డెల్టాలో రబీకోతలు ప్రారంభమైనా, చివరి భూములకు ఇంకా సాగునీటి ఎద్దడి కొనసాగుతోంది. తూర్పు, మధ్య డెల్టాల్లో వరిపంట కొన్ని ప్రాంతాల్లో కోతకు రాగా, శివారు ప్రాంతాల్లో మాత్రం ఇంకా సమయం పడుతోంది. గోదావరిలో సహజనీటి లభ్యత పూర్తిగా పడిపోవడం వల్ల పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ వైపు లాక్‌డౌన్‌ పరిస్థితులు, మరోవైపు సాగునీటి ఎద్దడితో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Godavari Delta Water Crises
గోదావరి డెల్టాలో సాగునీటి కష్టాలు
author img

By

Published : Apr 11, 2020, 7:27 AM IST

గోదావరి డెల్టాలో సాగునీటి కష్టాలు

తూర్పుగోదావరి జిల్లాలో తూర్పు, మధ్య గోదావరి డెల్టాల్లో రబీలో లక్షా 64వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరిపంట సాగవుతోంది. తూర్పు డెల్టాలో 40వేల హెక్టార్లలో పైగా ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. మరో 60వేలకు పైగా హెక్టార్లు కోతకు సిద్దంగా ఉన్నాయి. శివారు పొలాలకు సాగునీరందడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రామచంద్రాపురం, అమలాపురం, కాకినాడ డివిజన్‌ పరిధిలోని శివారు మండలాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొందని రైతులు చెబుతున్నారు. ఈనెలాఖరు వరకు సాగునీరందిస్తే పంటలు పండే అవకాశం ఉందని, లేదంటే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాళ్లరేవు ప్రాంతంలో సాగునీరు పూర్తిస్థాయిలో అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు. తాజాగా పంట గింజ గట్టిపడుతున్న దశలో నీరు అందక రైతులు తీవ్ర ఆవేదనలో చెందుతున్నారు. వంతులవారీ విధానంలో కూడా నీరందంటం లేదంటున్నారు.

ఏప్రిల్ 10లోపు పూర్తి చేయండి: జలవనరులశాఖ

ఇప్పటికే గోదావరిలో నీటి లభ్యత పూర్తిగా పడిపోయింది. సీలేరు నుంచి వస్తున్న అరకొర జలాలతోనే ఇప్పటి వరకు నీరందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అవసరానికి సరిపడా సాగు నీరు అందుబాటులో లేదని, రైతులు సర్ధుబాటు చేసుకుని, ఏప్రిల్‌ 10వ తేదీ లోపే పంటలు పూర్తి చేసుకోవాలని జలవనరులశాఖాధికారులు సూచిస్తున్నారు.

గోదావరి డెల్టాలో 80శాతం పైగా కౌలుదారులే వరి సాగుచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో కూలీల కొరత, సాగునీటి ఎద్దడి వల్ల పంటలకు నెలాఖరు వరకు సాగు నీరించాలని రైతులు కోరుతున్నారు. లేదంటే పంటలు పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి...పౌల్ట్రీ రంగంపై కరోనా ప్రభావం తీవ్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.