Girls created sculpture: ప్రస్తుత సమాజంలో రోజు రోజుకూ ఆడపిల్లల మీద అరాచకాలు పెరుగుపోతున్నాయి. పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యేదాకా రోజూ ఏదో చోట ఆడపిల్లల మీద అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. మనం వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నా.. ఏదో ఓక దారుణం జరుగుతూనే ఉంది. అలాంటి దారుణాాలను ఎత్తిచూపుతూ ఇద్దపు బాలికలు సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
రేపు 'జాతీయ బాలిక సంరక్షణ దినోత్సవం' ను పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్ధినులు దేవిన సోహిత, ధన్యతలు రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంది. ప్రస్తుత సమాజంలో బాలిక గర్భంలో ఉండగానే జరిగే అరాచకాలను ఎత్తిచూపుతూ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఆడపిల్లగా పుట్టడమే పాపమా అని ప్రశ్నిస్తూ.. అత్యాచారాలు, అబార్షన్లు, లింగ వివక్ష , బాల్యవివాహాలు నుంచి గర్భంలో శిశువును రెండు చేతులతో ఒడిసి పట్టుకొని కాపాడుతున్నట్టుగా శిల్పాన్ని రూపొందించారు. 5 యూనిట్ల ఇసుక ఉపయోగించిన చేసిన శిల్పాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాఠశాలకు వస్తున్నారు. ఈ సందర్భంగా సోహిత ధన్యతలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
ఇవీ చదవండి: