తూర్పుగోదావరి జిల్లా వైరామవరం మండలం డొంకరాయి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని విశాఖ జిల్లా సీలేరు నుంచి రాయపూర్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి విలువ రూ. 30 లక్షలు ఉంటుందని వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేశారు.
మరో ఘటనలో విశాఖ నుంచి హరియాణాకు లారీలో తరలిస్తున్న వెయ్యి కేజీల గంజాయిని డొంకరాయి వద్ద పోలీసులు పట్టుకున్నారు. కొబ్బరి లోడ్ ముసుగులో 40 ప్లాస్టిక్ సంచుల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని లారీని సీజ్ చేశారు.