తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పర్యటించారు. వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలైన చింతూరు, కోనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో నష్టపోయిన రైతులను పరామర్శించారు. పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దీనిపై పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి. ..'మేటి కొప్పాక'.. మనసు దోచే కొండపల్లి బొమ్మల వైభవం