తూర్పుగోదావరి జిల్లాలో వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కోనసీమ ప్రాంతంలో వరద నెమ్మదిగా తగ్గుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దిగువకు 15 లక్షలు పైబడి వరద నీటిని వదులుతున్నారు. ఈ నీరంతా కోనసీమ మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఐదు రోజులుగా కోనసీమలోని లంక గ్రామాలు వరదలోనే మునిగిపోయాయి. సుమారు 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలోనే ఉద్యాన పంటలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. లంక గ్రామాల ప్రజలు నాటు పడవలు మీద రాకపోకలు సాగిస్తున్నారు.
ఇదీ చదవండి: