గోదావరి వరద ప్రవాహంతో తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. కూరగాయల , పూలతోటలు, అరటి, బొప్పాయి తదితర పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. కూరగాయల పంటలకు కేంద్రమైన ఆలమూరు మండలంలోని బడుగువాని లంక, చెముడులంకల్లో కూరగాయల పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ పంటలు వేసిన వారందరు కౌలు రైతులు కావటంతో రైతు కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నాయి. అప్పులు చేసి పెట్టుబడి పెడితే, చేతికందాల్సిన పంటలు వరద నీటి పాలైయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇది చూడండి: విహారి: ప్రకృతి ఒడిలో కాసేపు 'భద్ర'ముగా...