గోదావరికి వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని లంక ప్రాంతాలు, బ్యారేజీ దిగువన ఉన్న పొలాలు నీట మునిగాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లోని .. కొబ్బరి, మామిడి, అరటి, కంద, కూరగాయలు, మునగ, బొప్పాయి తోటలు నీటిలో తేలియాడుతున్నాయి.
లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన పంటలు కళ్ళ ఎదురుగానే పాడై పోతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు నాలుగైదు రోజులు ఇలాగే ఉంటే పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.