ETV Bharat / state

కాలుష్య భూతం.. రాఘవమ్మ చెరువులో చేపలు మృత్యువాత - రాయభూపాలపట్నం రాఘవమ్మ చెరువులో చేపలు మృతి తాజా వార్తలు

రాయభూపాలపట్నంలోని రాఘవమ్మ చెరువులో.. వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. చేపలన్నీ మృతిచెంది ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఈ ఘటనకు ఫ్యాక్టరీల నుంచి విడుదలైన వ్యర్థాలే కారణమని స్థానికులంటున్నారు.

fishes dead
రాఘవమ్మ చెరువులో వేలాది చేపలు మృతి
author img

By

Published : Apr 3, 2021, 8:22 PM IST

రాఘవమ్మ చెరువులో వేలాది చేపలు మృతి

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలోని రాఘవమ్మ చెరువులో వేలాది చేపలు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. 178 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చూట్టూ విస్తరించిన ఫ్యాక్టరీల వ్యర్థాల వల్లే ఈ విధంగా జరిగిందని స్థానికులంటున్నారు.

మరోవైపు కొంతమంది ఈ చెరువులో పట్టిన చేపలనే అమ్ముతున్నారని.. మత్స్యశాఖ అధికారులు వీటిపై పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. చనిపోయిన చేపల నుంచి వస్తున్న దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:

సరకు రవాణాలో మూడో స్థానంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.