ETV Bharat / state

యానాంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

తూర్పుగోదావరి జిల్లా సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. బాధిత బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బాలుడు కోవిడ్-19 వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతని తాత, మామ్మను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు.

first covid-19 case filed in Yanam
యానాంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు
author img

By

Published : Jun 21, 2020, 4:36 PM IST

తూర్పుగోదావరి జిల్లా సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కేసు నమోదైన సమీప ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కనకాలపేట గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించి రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు.

  • రక్షణ చర్యలు...

యానాంలో మొదటిసారిగా కరోనా కేసు బయటపడిన కారణంగా... అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న రహదారుల్లో అగ్నిమాపక శాఖ వాహనంతో హైపోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారీ చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటికి ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి కోవిడ్ అనుమానిత లక్షణాలు కలిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు.

పోలీస్ శాఖ 24 గంటలు బందోబస్తు నిర్వహిస్తూ ఇతరులు ఎవరు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు కలిగిన బాలుడి ఇంటికి పక్కన ఉన్నవారు బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చినవారికి వంద రూపాయల జరినామా విధిస్తున్నారు.

  • ఆరోగ్య శాఖ మూడు నెలల నివేదిక...

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2375 మందిని క్వారంటైన్ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 450 మంది హోమ్ క్వారెంటైన్ చేసి... 650 మందికి కోవిడ్-19 వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తమ నివేదికలో వివరించింది.

యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్యం అందించేందుకు 50 పడకల ఐసోలేషన్ వార్డు, మూడు వెంటిలేటర్లు కలిగిన కోవిడ్-19 ప్రత్యేక వార్డు అందుబాటులో ఉన్నాయని... ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...: రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు..ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.