తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామ శివారులో ఉన్న పాత గోనె సంచుల గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్తు షార్ట్ సర్క్యూ ట్ కారణంగా ప్రమాదం జరిగి మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 3 నుంచి 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆదాయం పెంచేందుకు కార్గో సేవలు పెంచనున్న ఆర్టీసీ అధికారులు