తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధం కాగా.. రూ.4 లక్షల ఆస్థినష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో మరో ఇంటికి వ్యాపించాయి. ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంతో.. తాము రోడ్డునపడ్డామని ఈ ఇళ్లల్లో జీవిస్తున్న 5 కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...