కరోనా మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి. రాజోలు మండలం కూనవరం గ్రామంలో శుక్రవారం ఉదయం కరోనాతో మాజీ ఎంపీటీసీ సభ్యుడు చెల్లింగి రంగారావు అనే (75) మృతి చెందారు. గ్రామస్థులు, బంధువులు అంతిమ సంస్కారాలు నిర్వహించకపోవడంతో.. సర్పంచ్ జ్యోతి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. పీపీఈ కిట్లు ధరించి కొవిడ్ నిబంధనల మేరకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవీ చదవండి:
భారీగా పతంజలి కల్తీ నూనె- ఫ్యాక్టరీ సీజ్
Trains cancelled: ప్రయాణికులు లేక.. 8 రైళ్లు తాత్కాలికంగా రద్దు