తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని కొత్తపేటలోని వానపల్లి అవిడి పీహెచ్సీలో పరీక్షలు నిర్వహించగా... కొత్తపేటలో 6, వానపల్లిలో 5, అవిడిలో 3 కేసులు, పలివేలలో ఒక కేసు నమోదైనట్లు పీహెచ్సీ వైద్యాధికారులు శర్మ, రవికుమార్ లు తెలిపారు. వీరిలో తహసిల్దార్ కార్యాలయంలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగికి, కొత్త పేట పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ కు కరోనా సోకినట్లు అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: