వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతిని.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో సుమారు 25వేల ఎకరాల్లో వరి చేలు నీటిపాలయ్యాయి. సాగుమడి నిండా నిలిచిన నీటిలో.. నేలకొరిగిన వరిపైరు నానుతోంది.
దీంతో.. ధాన్యం చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వరి ధాన్యం కోసి ఉంచగా.. అది తడిసి మొలకెత్తిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని పంట నష్టపోయిన రైతులు కోరుతున్నారు.
ఆకాల వర్షాలతో రామచంద్రాపురం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. కె. గన్నవరం, కాజూలూరు, రామచంద్రాపురం మండలాల్లో పంటలను పరిశీలించిన ఆయన.. కౌలు రైతులకు న్యాయం జరిగేలా రైతులతో సమన్వయం చేసి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామని ఆయన వివరించారు.