తూర్పుగోదావరి జిల్లా రాజోలులో విద్యుత్ తీగలు రైతు ప్రాణం తీశాయి. గ్యాస్ కంపెనీ సమీపంలోని తన పొలంలో 45 ఏళ్ల తాతయ్య ట్రాక్టర్ పైనుంచి పశువుల దాణా దించుతున్నాడు. కిందకు వేలాడుతున్న 11కేవీ విద్యుత్ తీగలు ఒక్కసారిగా ఆయనకు తగిలాయి. దీంతో అక్కడికక్కడే తాతయ్య ప్రాణాలు విడిచాడు.
అప్పుడే ఇంటి నుంచి పొలానికి వెళ్లిన తాతయ్య విగతజీవిగా మారటంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వేలాడుతున్న తీగలు సరిచేయాలని విద్యుత్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని... ఇప్పుడు అవే అన్నదాత ఊపిరి తీశాయని స్థానికులు అంటున్నారు. మృతదేహాన్ని రాజోలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..