తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని జగన్నాయక్ పూర్ పెట్రోలు బంక్ వద్ద యువతి నిరసన చేపట్టింది. పెట్రోల్ బంక్ ఓనర్ ప్రేమ పేరుతో తనను మోసం చేసి గర్భవతిని చేశాడని ఆందోళనకు దిగింది. ప్రేమ పేరుతో వంచన చేశాడని బిడ్డతో కలిసి యువతి ఆందోళన చేపట్టింది.
పాలకోడేరుకు చెందిన బలే శ్రీదేవి, కాకినాడకు చెందిన కర్రి కిరణ్ పాల్ రెడ్డి ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. కొన్నిరోజుల తర్వాత ప్రేమలో పడ్డారు. కిరణ్పాల్ రెడ్డి యువతిని తల్లిని చేసి... ముఖం చాటేశాడు. యువతి పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. యువతిని కిరణ్పాల్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయాలని కిరణ్ పాల్ రెడ్డి పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు